Header Banner

తృటిలో తప్పిన పెను ప్రమాదం! 453 కేజీల బాంబు! ఎక్కడంటే?

  Sat May 03, 2025 17:12        Others

దీపావళికి చిన్న చిన్న బాంబులు పేలిస్తేనే.. గుయ్ అనే సౌండ్ తో చెవులు చిల్లులు పడిపోతుంటాయ్. ఇక బాంబ్ బ్లాస్ట్ జరిగితే చోటు చేసుకునే మరణాలు, విషాదం మాటల్లో వర్ణించలేనిది. అదే 453 కేజీల బాంబు పేలితే ఎలా ఉంటుంది. ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది ఈ విజువల్. ఎన్ని మరణాలు, ఎంతటి విషాదం.. వర్ణించలేని శోకమే మిగులుతుంది. ఇంతటి పెను ప్రమాదం తప్పడం అంటే చాలా చాలా మంచి విషయమని చెప్పాలి. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వర్వాండిలో జరిగింది.

 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 453 కేజీల బరువున్న భారీ బాంబును ఆర్మీ అధికారులు సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో వందలాది ప్రాణాలు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఈ సంఘటన మార్చి 28న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక రైతు రాజేంద్ర ధాగే తన పొలంలో ఆరడుగుల భూమి లోపల ఏర్పాటుచేసుకున్న పైపులు పగిలిపోవడంతో వాటిని మరమ్మతు చేయడానికి తవ్వకం చేస్తున్న సమయంలో ఒక బాంబు పిన్ కనిపించిందని రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

 

దీంతో తహసీల్దార్ జ్ఞాన్‌దేవ్ బెల్హేకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం పంపించారు. వెంటనే అధికారులు ప్రాంతాన్ని ఖాళీ చేయించి, బాంబును సమర్థవంతంగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు. ఆ తర్వాత పుణెకు చెందిన వైమానిక, ఆర్మీ దళాలకు చెందిన 10 మంది నిపుణులు వర్వాండికి చేరుకున్నారు. నెల రోజులపాటు శ్రమించి జేసీబీ సహాయంతో బాంబు చుట్టూ ఏడడుగుల గొయ్యి తవ్వారు. ఆ తర్వాత బాంబు స్క్వాడ్ బృందాల సహాయంతో బాంబును నిర్వీర్యం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

 

చివరికి " బాంబు 4.5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగి ఉందని.. మొత్తం 453 కేజీల బరువు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నిర్వీర్యం చేసిన తర్వాత బాంబును ప్రత్యేక వాహనంలో అహల్యానగర్ సమీపంలోని కెకె రేంజ్‌కు తరలించారు. ప్రయాణ సమయంలో భద్రతా చర్యలుగా ఆ మార్గంలో అరగంటపాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. బాంబు పేలి ఉంటే కిలోమీటర్ల మేర ఇళ్లు నేలమట్టమయ్యేవని.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మదిరిగే షాక్! లిక్కర్ మాఫియాలో మరో నిందితుడు అరెస్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #bombdefused #maharashtranews #beeddistrict #armyheroes #453kgbomb #majortragedyaverted #bombscare